తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!
మద్యం సేవించి వాహనం నడపడం నేరం. అందుకే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి తాగి వాహనం నడిపేవారికి ఫైన్ వేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. ఇకపై అలా కుదరదంటున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే నేరుగా జైలుకే అంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ యువకుడిని జైలుకు పంపారు.
శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో సెప్టెంబరు 20న పోలాకి మండలానికి చెందిన శ్రీను మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ డే అండ్ నైట్ కూడలి వద్ద పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతన్ని ఆపడంతో వారితో వాగ్వాదానికి దిగాడు యువకుడు. దాంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 45 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు ముమ్మరం చేసి తాగి వాహనాలు నడిపినట్టు రుజువైతే కోర్టుకు పంపిస్తున్నారు. తీవ్రత ఆధారంగా జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలోనూ రోజుకో మార్గంలో వాహన తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వేళ్లల్లోనే ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. బ్రీత్ అనలైజర్ రీడింగ్‌లో 100కు 30 శాతం రీడింగ్ వస్తే మద్యం తాగినట్లు గుర్తించి వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఫైన్ కట్టిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇస్తారు. రెండు కంటే ఎక్కువ సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పనిసరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్
రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి
భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు
ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

