AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి

రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి

Phani CH
|

Updated on: Nov 02, 2025 | 2:22 PM

Share

దొంగలు రూటు మార్చారు. సాధారణంగా మగవారు రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటారు. ఇక మహిళలు అయితే పగటివేళ దుకాణాల్లో కస్ట్‌మర్స్‌గా వెళ్లి వస్తువులు దొంగిలించడం చూశాం. ఇలాంటి అనేక ఘటనలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాజాగా ఓ యువతి, యువకుడు పగటివేళ రెక్కీ నిర్వహించి రాత్రివేళ గోడదూకి ఇళ్లలోకి చొరబడుతూ దొంగతనాలకు పాల్పడ్డారు.

మేడ్చల్‌ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. బోడుప్పల్ సాయిరాం నగర్ కాలనీలో ఓ జంట పగలు ఆపరిసరాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసి ఉన్న ఇంట్లో రాత్రివేళ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువా తాళం విరగ్గొట్టి అందులోని బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆ ఇంటి యజమాని, కుటుంబం ఇంటికి వచ్చి చూసేసరకి తలుపు తెరిచి ఉండటంతో కంగారు పడ్డారు. లోపలికి వెళ్లిచూడగానే వారు అనుకున్నదే జరిగింది. ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించగా బీరువాను బద్దలుకొట్టి చోరీకి పాల్పడ్డారని, దొంగలు అరగంటపైనే ఆ ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే అదే ప్రాంతంలో మరో ఘటన కూడా జరిగింది. సాయిరాం నగర్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి రాత్రి తన ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఉంచాడు. ఉదయం చూసేసరికి బైక్ కనిపించలేదు. మొదట తన స్నేహితులు తీసుకెళ్లారేమోనని చుట్టుపక్కల వారిని అడిగాడు. ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, అదే యువకుడు–యువతి బైక్ ఎత్తుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో శ్రీకాంత్ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీ ఆధారంగా కేసుదర్యాప్తు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో యువతి, యువకుడు ఇద్దరూ మాస్కులు ధరించి ఉన్నారు. వారి కదలికలు, దుస్తుల వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ ఫుటేజీలను సాంకేతిక సిబ్బందితో విశ్లేషిస్తూ, దొంగలు ఉపయోగించిన వాహనం వివరాలను కూడా సేకరిస్తున్నారు. అనుమానితులు అదే ప్రాంతానికి చెందినవారై ఉంటారని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు

ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌

కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి

రన్నింగ్‌ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు

విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం