AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్‌

20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్‌

Phani CH
|

Updated on: Nov 02, 2025 | 2:34 PM

Share

ప్రస్తుతం జుట్టుకు రంగు వేసుకోవడం సాధారణ విషయంగా మారింది. ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటూ ఉంటారు. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని హీనన్ ప్రావిన్స్‌కు చెందిన హుఆ అనే 20 ఏళ్ల యువతి కె-పాప్ డ్రామాను ఫాలో అవుతూ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ప్రతి నెలా హెయిర్ డైయింగ్‌ చేసేది.

ఆమెకు ముందుగా తలనొప్పి స్టార్ట్ కాగా ఆ తర్వాత కాళ్లపై ఎర్రటి మచ్చలు, కీళ్లనొప్పులు, కడుపు నొప్పి కూడా రావడంతో డాక్టర్‌ను ఆశ్రయించింది. ఈ లక్షణాలను గమనించిన వైద్యులు. కలర్‌ డైల వాడకం వల్ల తలపై ఉన్న పోరస్ స్కిన్ ద్వారా రక్తంలోకి టాక్సిన్స్ ప్రవేశించాయనీ ఈ పరస్థితి రీనల్‌ ఫెయిల్యూర్‌కు దారితీసిందని షాకింగ్ వార్త చెప్పారు. తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఆమెకు 20 ఏళ్ల వయసులో కిడ్నీ వ్యాధి రావడం బాధాకరం. కొన్ని రకాల హెయిర్ డైలల్లో పారా-ఫినైలీన్‌ డైఅమైన్ పీపీడీ అనే రసాయనం ఉంటుంది. రంగు ఎక్కువ కాలం పాటు జుట్టుపై నిలిచి ఉండేందుకు హెయిర్ డైలల్లో ఈ రసాయనాన్ని వాడతారు. పీపీడీ రక్త ప్రవాహంలోకి చేరితే సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. ఈ రసాయనాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలపై భారం పెరుగుతుంది. వైద్యుల ప్రకారం, మన తల మాడుపై ఉన్న చర్మంలో రక్తనాళాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ మనం వాడే నూనెలు లేదా రసాయనాలు త్వరగా శరీరంలోకి ఇంకిపోతాయి. ముందుగా మీరు వేసుకోబోయే హెయిర్ డైతో ప్యాచ్ టెస్టు చేయించుకోవాలి. ఇందులో భాగంగా చేయిపై కొద్దిగా రంగును అప్లై చేయాలి. ఆ తరువాత అలర్జీ రియాక్షన్‌లు ఏవీ రాకపోతేనే ఆ హెయిర్‌డైని వినియోగించాలి. తలపై హెయిర్ డైని ఎక్కువ సేపు ఆరబెట్టకుండా వీలైనంత త్వరగా కడిగేసుకుంటే రిస్క్ కొంత తగ్గుతుంది. హెయిర్ డైలకు బదులు హెన్నా లాంటివి వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హెయిర్ డైలను వాడక తప్పదని అనుకుంటే పీపీడీ-ఫ్రీ, అమోనియా-ఫ్రీ అని లేబుల్స్ ఉన్న ఉత్పత్తులనే వాడాలి. హెయిర్ డైలను 8 వారాలకు ఒకసారి మాత్రమే పరిమితం చేయాలని నిత్యం హెయిర్ డై వాడే వారికి నీరసంగా ఉండటం, వాపు లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి

భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు

ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌

కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి

రన్నింగ్‌ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు