ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్
ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురయింది. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న వస్తువుల నుంచి కోట్ల ఖరీదైన వస్తువుల దాకా ఆన్‌లైన్‌లో కొనడం పరిపాటిగా మారింది. దీనిని అవకాశంగా మలచుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు మనం నెట్టింట చూశాం. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో ఓ ఖరీదైన ఫోను ఆర్డర్ పెట్టాడు.
అయితే అతనికి డెలివరీ చేసిన పార్శిల్‌లో ఫోనుకు బదులు రాయిముక్క ఉండటం చూసి షాకయ్యాడు. బెంగళూరులో నివసించే ప్రేమానంద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్టోబరు 14న అమెజాన్ యాప్ ద్వారా రూ. 1.87 లక్షల విలువైన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశారు. పూర్తి మొత్తాన్ని తన క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించారు. అక్టోబరు 19న అతనికి డెలివరీ ప్యాకేజీ అందింది. ప్యాకేజీని తెరిచే ముందు ఎందుకైనా మంచిదని అన్‌బాక్సింగ్ ను వీడియో తీశాడు. సీల్డ్ ప్యాకేజీని తెరవగా, అందులో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఒక టైల్ ముక్క ఉండటం చూసి అతను షాక్ అయ్యాడు. ఈ ఘటనపై ప్రేమానంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను లక్షల విలువైన ఫోను ఆర్డర్ చేస్తే దీపావళికి ఒక్కరోజు ముందు ఫోన్‌కు బదులుగా టైల్ ముక్క రావడం తనను ఎంతగానో బాధించిందని వాపోయారు. ఈ సంఘటన తమ ఇంట్లో పండగ ఉత్సాహాన్ని పూర్తిగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతుండగానే అమెజాన్ సంస్థ.. ప్రేమానంద్‌కు అతను చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి వాపసు చేసినట్టు సమాచారం. పోలీసులు ఈ డెలివరీ స్కామ్‌పై విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి
రన్నింగ్ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు
విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం
రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్!
అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

