రన్నింగ్ రైలులో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన ప్రయాణికులు
వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వరదలతో పాటు పాములు ఇళ్లల్లోకి కొట్టుకొస్తుంటాయి. ఇక కారులు, బైకుల్లో కూడా పాములు దూరిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో పాములు కాటేసి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే రన్నింగ్‌లో ఉన్న ఓ రైలులో కొండ చిలువ కలకలం రేపింది.
రైలు బోగీలోని టాయిలెట్ వద్ద కొండ చిలువ కనిపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బోగీ నుంచి మరో బోగీలోకి పరుగులు పెట్టారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లోకి కొండచిలువ ప్రవేశించింది. సకాలంలో స్పందించిన రైల్వే పోలీసులు పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఎస్-2 బోగీలో మూత్రశాలల వద్ద పామును చూసిన ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. టీటీఈ అక్కడకు చేరుకుని పామును గుర్తించి.. సమీప రైల్వే స్టేషన్ ఖమ్మం ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం నగరానికి చెందిన పాములు పట్టే మస్తాన్ అనే వ్యక్తిని పిలిపించారు. ఖమ్మం స్టేషన్‌లో రైలు ఆగగానే.. రైల్వే పోలీసులు, మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టుకున్నారు. సమీపంలోని అడవిలో కొండచిలువను వదిలిపెట్టారు. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజువలైజేషన్ టెక్నిక్‌తో భయాలు దూరం
రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్!
అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

