చెట్లు ఎక్కే పాములు.. ఎక్కడో కాదు.. మన కోనసీమలోనే..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ అభయారణ్యం మడ అడవుల్లో అరుదైన సర్పాలు సంచరిస్తున్నాయి. నది,సముద్రం కలిసిన ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటు న్నాయి. బురద మట్టి చిత్తడి నేలలు అనుకూలం కావడం తో కొత్తరకం పాములు ఎక్కువగా కనిపిస్థాయి. మడ అడవుల్లో మడ పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయి....ఇవి విష పూరితమైన పాములు.
పగలు ఇవి మడ చెట్ల పైనే నిద్రపోతుంటాయి. ఎలుకలను వేటాడుతుంటాయి. పచ్చని ఆకులలో నిత్యం ముడుచుకుని.. కీటకాలను పట్టుకుంటాయి. రాత్రి పూట మాత్రమే సంచరిస్తాయి. తిన్న ఆహారాన్ని బట్టి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోగలవు ఇవి. మీటరు పొడవున్న ఈ పాము.. అభయారణ్యం లో సంచరిస్తున్న ఓ వ్యక్తి ని కరవడంతో అత్యవసరంగా వైద్యం చేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.. సాధారణంగా మానవ సంచారానికి దూరంగా ఎత్తైన ప్రదేశంలో సంచరిస్తుంటాయి. మడ అడవుల్లో ఉండే మరో సర్పజాతి గుడ్లు పాము…అవి కుక్క ముఖాన్ని పోలి ఉంటాయి. విషం ఉండదు…కరిచినా ప్రమాదం ఉండదు..తీవ్రమైన నొప్పి మాత్రం ఉంటుంది. ప్రాణాప్రాయం ఉండదు. ఈ పాములు బురదమట్టి చిత్తడి నేలలోని నీటిలో కలిసిపోయి ఉంటాయి…చిన్నచిన్న చేపలను వేటాడి తింటుంటాయి. మెరిసే రంగుతో కనిపించే మరో సర్పజాతి గోసిమార్ స్నేక్. ఈ పాములు శారీరమంతా వెండి రంగులో మెరుస్తుంటాయి. వీటివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. తీర ప్రాంత చిత్తడి నేలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మడ అడవుల్లో కొత్తగా కనిపించే స్నేక్స్ కోసం ఫారెస్ట్ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్యాటకులను కూడా ఈ రంగురంగుల సర్పాలు కనువిందు చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Montha Effect: ఇంకా ముంపులోనే పంట పొలాలు
భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా
మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

