క్షణ క్షణం.. ఉత్కంఠ !! నెక్ట్స్ లెవల్ హర్రర్ ఫిల్మ్ !!
హర్రర్ సినిమాలు చూసి చూసి.. ఇప్పుడు హర్రర్ సినిమాల లవర్స్ ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తమల్ని భయపెట్టి థ్రిల్‌కు గురిచేసే సినిమాలను తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హర్రర్ ఫ్యాన్స్ చాలా మందికి నచ్చిన సినిమానే వష్ లెవల్ 2. పేరుకు గుజరాతీ సినిమానే అయినా.. ఓటీటీలో హిందీలో కూడా అందుబాటులో ఉండడంతో.. ఇప్పుడీ సినిమా చాలా మంది ప్రేక్షకులను చేరవై.. అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తోంది.
సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. 2023లో గుజరాతీలో ‘వష్’ అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని అజయ్ దేవగణ్ హిందీలో ‘సైతాన్’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో ‘వష్’ గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే దర్శకనిర్మాతల వష్ లెవల్ నుంచి సీక్వెల్ వచ్చింది. ‘వష్ లెవల్ 2’ పేరుతో మరో సినిమా తీశారు. ఇక ఈ వష్ లెవల్ 2 సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. కథ విషయానికి వస్తే.. తొలి భాగానికి కొనసాగింపుగా ‘వష్ 2’ మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్‌లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ. స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే ‘వష్ 2’ సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. మీకు కూడా హర్రర్ సినిమాలు ఇష్టమైతే.. ఈ మూవీ పై మీరు కూడా ఓ లుక్కేయండి. అయితే తెలుగు వర్షన్ మాత్రం ఇప్పటికైతే అందుబాటులో లేదు. సో హిందీలో చూసేయొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్
ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు
అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్ ఆత్మహత్య
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

