ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు
ఆమె ధరించిన ‘గ్రేస్ డిలైట్ టోట్’ బ్యాగ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనాయె తకాయిచీ తన అధికారిక నివాసంలోకి వెళుతున్న ఓ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తకాయిచీ.. నలుపు రంగులో ఉన్న ఓ లెదర్ బ్యాగును తీసుకెళ్లడం కనిపిస్తోంది. దీంతో ఆ బ్యాగుపై జపాన్ వాసుల్లో ఆసక్తి పెరిగింది.
నెటిజన్లు ఆరా తీయగా.. సదరు బ్యాగును నాగానో కు చెందిన హమానో కంపెనీ తయారు చేసిందని తేలింది. పూర్తిగా లెదర్ తో చేసినప్పటికీ ఆ బ్యాగు చాలా తేలికగా బరువు కేవలం 700 గ్రాములు మాత్రమే ఉంటుంది. హమానో కంపెనీకి జపాన్ నలుమూలల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. తమ 145 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఆర్డర్లు అందుకుంటున్నట్లు హమానో కంపెనీ యాజమాన్యం తెలిపింది. ‘గ్రేస్ డిలైట్ టోట్’ పేరుతో అమ్మకానికి పెట్టిన ఈ బ్యాగు ధర 895 అమెరికన్ డాలర్లు.. అంటే జపాన్ కరెన్సీలో 1,36,424 యెన్ లు.. భారత కరెన్సీలో రూ.79 వేలు. జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో జరిగిన సంభాషణను ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పంచుకున్నారు. జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన తకాయిచకి అభినందనలు తెలియజేశారు. భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధాని ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయె తకాయిచి జపాన్ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు. మందగమనంలో ఉన్న జపాన్ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం ప్రధానమంత్రిగా ఆమె ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పవచ్చు. అయితే పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికవడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్ ఆత్మహత్య
ట్రాఫిక్ పోలీసుపై యువకుడి రివెంజ్.. చుక్కలు చూపించాడుగా
అయ్యో ఈ మూగజీవికి ఎంత కష్టం వచ్చింది
బిగ్ అలర్ట్ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

