ట్రాఫిక్ పోలీసుపై యువకుడి రివెంజ్.. చుక్కలు చూపించాడుగా
ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి ఫైన్స్ వేస్తారు. మరి ప్రజలకు రూల్స్ చెప్పే అధికారులే రూల్స్ అతిక్రమిస్తే.. అంటే తాము అధికారులం కదా.. మనల్ని ఎవరు అడుగుతారులే.. అనున్నారో ఏమో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేటు సరిగా లేని స్కూటర్‌పై వెళ్తూ ఓ యువకుడికి దొరికిపోయారు. దాంతో ఆ యువకుడు ఆ పోలీసులపై రివెంజ్ తీర్చుకున్న తీరు మామూలుగా లేదు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడో యువకుడు.. హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించినందుకు తనకు రూ.వెయ్యి ఫైన్ వేశారన్న కోపంతో ఉన్న ఆ యువకుడికి ఈ ట్రాఫిక్ పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్ పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకుని డబుల్ ఫైన్ విధించేలా చేశాడు. ట్రాఫిక్ పోలీసులు వెళ్తున్న స్కూటర్ ను పరుగెత్తుకెళ్లి వెనక నుంచి పట్టుకుని ఆపేశాడు. చచ్చినట్టు స్కూటర్ ఆపి ఏంటయ్యా నీగోల అంటూ యువకుడిని దబాయించారు. దాంతో యువకుడు చెప్పిన విషయం విని ఖంగుతిన్నారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోపై డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ స్పందించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని అలా ప్రమాదకరంగా ఆపడం, గొడవపడడం సరికాదన్నారు. ఓ ఫొటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని హితవు పలికారు. ట్రాఫిక్ సిబ్బంది ప్రయాణించిన ఆ స్కూటర్ వారిది కాదని, వారి స్నేహితుడిదని వివరణ ఇచ్చారు. స్కూటర్ కు ముందు వైపు నెంబర్ ప్లేట్ సరిగా లేదని, మిర్రర్ లేదని గుర్తించామన్నారు. నిబంధనల ప్రకారం ఆ స్కూటర్ యజమానికి రూ.2 వేల జరిమానా విధించామని మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది పేర్లు, ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో ఈ మూగజీవికి ఎంత కష్టం వచ్చింది
బిగ్ అలర్ట్ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి
కాలర్ ఐడీ వచ్చేస్తోంది ఇక ఫేక్ కాల్స్‌కు చెక్
కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

