AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

Phani CH
|

Updated on: Nov 01, 2025 | 11:18 AM

Share

ఆకాశంలో కనిపించిన ఓ అద్భుత దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేసింది. రంగురంగుల కాంతులతో వింత వెలుగులపై ప్రజలు రకరకాలుగా చర్చించుకున్నారు. కొందరు దీన్ని క్షిపణి ప్రయోగం అని భావించగా, మరికొందరు గ్రహాంతరవాసులైన ఏలియన్స్‌ వాహనం అని ప్రచారం చేశారు. అయితే, ఇది మానవ చర్య కాదని, ప్రకృతి సృష్టించిన ఓ అరుదైన అద్భుతం అని తేలింది.

పాకిస్తాన్‌లోని కొహ్-ఎ-ముర్దార్ పర్వతశ్రేణిపై సూర్యోదయానికి కొద్దిసేపు ముందు ఈ దృశ్యం కనిపించింది. సుమారు 20 నిమిషాల పాటు కనువిందు చేసిన ఈ మేఘాలు.. సూర్యుడు ఉదయించగానే నెమ్మదిగా కనుమరుగయ్యాయి. వీటిని ‘లెంటిక్యులర్ క్లౌడ్స్’ అని పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి చాలా అరుదుగా ఏర్పడతాయి. ‘లెంటిక్యులర్’ అంటే ‘కటకం ఆకారం’ అని అర్థం. ఈ మేఘాలు నునుపుగా, గుండ్రంగా ఒకదానిపై ఒకటి పేర్చిన పళ్లాల్లా ఉండటంతో తరచుగా వీటిని గ్రహాంతరవాసుల వాహనాలుగా పొరబడుతుంటారు. పర్వత ప్రాంతాలలో తేమతో కూడిన గాలి వేగంగా ప్రవహించినప్పుడు ఈ మేఘాలు ఏర్పడతాయి. గాలి పర్వతాన్ని ఢీకొని పైకి లేచినప్పుడు చల్లబడి, అందులోని తేమ ఘనీభవించి ఈ ప్రత్యేక ఆకారంలో మేఘాలుగా మారుతాయి. ఈ మేఘాల అంచులు సూర్యరశ్మితో సరైన కోణంలో కలిసినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లా మెరుస్తాయి. క్వెట్టాలో కనిపించిన దృశ్యంలో ఈ రంగుల ప్రకాశం స్పష్టంగా కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన వారు తమ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాధారణంగా పర్వత ప్రాంతాలలో బలమైన గాలులు వీచినప్పుడు మాత్రమే ఇలాంటివి ఏర్పడతాయి. పాకిస్థాన్‌లో ఇవి కనిపించడం చాలా అరుదు. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, కాంతి కలయికతో ప్రకృతి ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చెప్పడానికి క్వెట్టాలో కనిపించిన ఈ దృశ్యమే ఒక చక్కటి ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా

ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్‌ దొంగ కూడా

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌

రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్‌ కారు

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్