AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌

Phani CH
|

Updated on: Nov 01, 2025 | 11:06 AM

Share

అగ్రరాజ్యంలో ట్రంప్‌ సర్కార్‌ అక్కడ పనిచేస్తున్న వేలాదిమంది విదేశీ ఉద్యోగులకు మరో బిగ్‌ షాకిచ్చింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)ల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి వస్తుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

అమెరికాలో పనిచేస్తున్న వేలాదిమంది విదేశీ ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా అమెరికాలోని ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈరోజు లేదా ఆ తర్వాత EAD రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు లభించదు. అయితే, ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వారి పొడిగింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. గతంలో బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, వలస ఉద్యోగులు తమ EAD గడువు ముగిసినప్పటికీ, రెన్యువల్ కోసం సకాలంలో దరఖాస్తు చేసుకుంటే 540 రోజుల పాటు పనిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు. జాతీయ భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు ట్రంప్ సర్కార్‌ తెలిపింది. వలస ఉద్యోగుల నేపథ్యాన్ని తరచుగా సమీక్షించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని, దేశ భద్రతకు హాని కలిగించే వారిని గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనను “కామన్ సెన్స్” చర్యగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అభివర్ణించారు. “అమెరికాలో పనిచేయడం అనేది ఒక హక్కు కాదు, అదొక ప్రత్యేక అవకాశం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు EAD గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని USCIS సూచించింది. దరఖాస్తు చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే, అంత ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సాధారణంగా అమెరికాలో నిర్దిష్ట కాలంపాటు పనిచేయడానికి అనుమతి ఉందని నిరూపించుకోవడానికి EAD అవసరం. అయితే, పర్మినెంట్ రెసిడెంట్లు, అలాగే హెచ్-1బీ, ఎల్-1బీ వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న వారికి ఈ డాక్యుమెంట్ నుంచి మినహాయింపు ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్‌ కారు

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్

ఇదేం పని !! కర్నూలు బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం గాలింపు

స్వీట్స్‌ తయారీలో నిమగ్నమైన సిబ్బంది.. అంతలోనే ఊహించని సీన్‌

కూతురు చనిపోయి ఏడుస్తుంటే.. లంచాల కోసం జలగల్లా పీడించారు