స్వీట్స్ తయారీలో నిమగ్నమైన సిబ్బంది.. అంతలోనే ఊహించని సీన్
అదొక స్వీట్స్ తయారుచేసే ప్రదేశం. ఆ ఇంట్లోనివారు, మరికొందరు సిబ్బంది కలిసి రోజూ రకరకాల స్వీట్లు తయారుచేసి దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. రోజూలాగే ఈరోజు కూడా స్వీట్స్ తయారీకి సిద్ధమయ్యారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ ప్రదేశంలోని ఓ మూల నుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. ఏమై ఉంటుందా అని వెళ్లి పరిశీలించి చూడగా వారికి గుండె ఆగినంత పనైంది.
వెంటనే అక్కడినుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖ అగనంపూడి రాజీవ్ నగర్ సమీపంలోని ఓ ఇంట్లో స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. రోజూలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యారు. ఇంతలో ఆ ఇంట్లోని ఓ మూలనుంచి వారికి ఏవో శబ్దాలు వినిపించాయి. మొదట ఎలుకలేమో అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ క్రమేపీ అక్కడ ఏదో మెదులుతున్నట్టు ఒక్కటే అలజడి రేగడంతో అక్కడ సామాన్లు తీసి చూశారు. అంతే ఒక్క ఉదుటన భయంతో వెనక్కి పరుగెత్తారు. ఆ సామాన్ల మధ్యలో ఓ భారీ గోదుమ త్రాచు కదులుతూ కనిపించింది. వెంటనే ఆ ఇంట్లోంచి అందరూ బయటకు పరుగెత్తుకొచ్చారు. విషయం తెలిసి ఇరుగుపొరుగువారు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. వెంటనే స్థానిక స్నేక్ క్యచార్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే ఆ త్రాచుపాము కిరణ్‌పై దాడి చేసేందుకు చాలా ప్రయత్నించింది. అతన్నుంచి తప్పించుకుపోవాలనుకుంది. కానీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన స్నేక్ క్యాచర్ పామును బంధించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పాముకి స్వీట్స్ అంటే ఇష్టమనుకుంటా.. అందుకే స్వీట్లు తినేందుకు వచ్చి ఉంటుందంటూ సరదాగా చర్చించుకున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు చనిపోయి ఏడుస్తుంటే.. లంచాల కోసం జలగల్లా పీడించారు
కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలోగా మృతి
వారం రోజులకు కనికరించిన దొంగ.. దోచుకున్న నగలు వాకిట్లో లభ్యం
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

