కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలోగా మృతి
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఊహించలేం!ఈ భూమ్మీద నూకలు ఉండాలే కానీ.. ఎంత ప్రమాదం జరిగినా బతికి బయటపడొచ్చు. అదే ఆయువు తీరితే మాత్రం. చిన్న చిన్న ప్రమాదాలకు సైతం ప్రాణాలు కోల్పోతుంటారు. అత్యంత ఖరీదైన కారులో వెళుతున్న ఓ మహిళను తాజాగా మృత్యువు మాటేసి కాటేసింది.
పూణే నుండి మాంగావ్‌కు కారులో ఒక మహిళ వెళుతోంది. ఆమె డ్రైవ్ చేస్తున్నది అత్యంత ఖరీదైన వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారు. అధునాతన ఫీచర్లు ఉన్న కారు ఎలాంటి ప్రమాదం నుంచైనా డ్రైవ్ చేస్తున్న వారిని బయటపడేస్తుంది. అయితే ఆమె మహారాష్ట్రలోని హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి జారి పడింది. సరిగ్గా ఆమె వెళుతున్న కారుపై పడి, అది కారు సన్‌రూఫ్‌ను చీల్చుకొని, అమాంతంగా కారులో డ్రైవ్ చేస్తున్న ఆమెపై పడింది. ఊహించని ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని గుజరాత్‌కు చెందిన 43 ఏళ్ల స్నేహల్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో ఘటనలో ముంబై నుంచి జల్నాకు వెళుతున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులను వెంటనే కిందకు దింపి, వారి ప్రాణాలను కాపాడాడు. అలాగే కర్నూలు బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగల్చడం చూసాం. మంటల్లో చిక్కుకుని 19 మంది సజీవ దహనమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారం రోజులకు కనికరించిన దొంగ.. దోచుకున్న నగలు వాకిట్లో లభ్యం
పెళ్లింట విషాదం.. ముగ్గురుని మింగేసిన రోడ్డు ప్రమాదం
అమెరికాలో ఆహార సంక్షోభం.. ఎమర్జెన్సీ ప్రకటన
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

