వారం రోజులకు కనికరించిన దొంగ.. దోచుకున్న నగలు వాకిట్లో లభ్యం
మహబూబాబాద్ జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది. కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి గుమ్మం ముందు గూటిలో పెట్టిన తాళం చెవి తీసుకొని ఇంటి తాళం తెరిచి దర్జాగా దొంగతనానికి పాల్పడ్డారు గుర్తుతెలియని దొంగలు. ఇంట్లో డబ్బాలో దాచిన 6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, ఆరు వందల రూపాయల నగదును చోరీ చేశారు.
ఇంటి యజమానురాలు అనసూర్య ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుల్ల అయింది.. దర్జాగా తాళంచెవి తీసుకొని దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో దొంగలుపడ్డ విషయం గమనించిన బాధితురాలు కన్నీరుమున్నీరు గా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంటి తాళాలు గూటిలో పెడతారని తెలిసిన వాళ్ళే ఈ చోరి చేసి ఉంటారని అంతా భావించారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా చోరికి గురైన బంగారం, వెండి ఆభరణాలు ఇంటి ముందు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇంటి ముందు దోచుకున్న సొత్తు పడేసి వెళ్లిపోయాడు. ఆనసూర్య ఉదయాన్నే ఇంటిముందు వాకిలి శుభ్రం చేస్తున్న క్రమంలో తన బంగారం, వెండి ఆభరణాలు గమనించి అవాక్కయింది. ఇరుగుపొరుగు వాళ్లని పిలిచింది. తన ఆభరణాలు తాను తీసుకుంది. తన బాధను గమనించి కనికరించిన దొంగలకు అనసూర్య కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లింట విషాదం.. ముగ్గురుని మింగేసిన రోడ్డు ప్రమాదం
అమెరికాలో ఆహార సంక్షోభం.. ఎమర్జెన్సీ ప్రకటన
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఎకరాకు రూ.10 వేల పంటనష్టం..
Tamannaah Bhatia: ఏజ్ బార్ ఇష్యూ గురించి మాట్లాడిన తమన్నా
Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

