తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఎకరాకు రూ.10 వేల పంటనష్టం..
మొంథా తుఫాను రైతులకు తీరని వేదన మిగుల్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది. దీంతో తెలంగాణలో తుఫాను..వరదల కారణంగా నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో..పంట నష్టం జరిగిన రైతులకు నష్ట పరిహారం పై ప్రకటన చేసింది. ప్రకటించిన పరిహారం రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. దీంతో పంట నష్టాన్ని అంచనా వేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తుమ్మల ప్రకటించారు. పశు సంపద , ఇళ్లు నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని, దీని గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలపై సర్వే నిర్వహించి సాయం అందిస్తామని అన్నారు. ఇక తడిసిన ధాన్యం కొనుగోలుపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం, 11 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని నష్టం తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: ఏజ్ బార్ ఇష్యూ గురించి మాట్లాడిన తమన్నా
Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్
Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా
సడన్ గా వెలుగులోకి వచ్చిన హీరోయిన్లు
Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

