Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్
హీరోయిన్ల ఏజ్ స్క్రీన్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తమన్నా చెబితే, తన రియల్ లైఫ్ ఏజ్ గురించి మాట్లాడేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్. కింగ్ మూవీలో నటిస్తున్నారు కింగ్ ఖాన్. ఈ సినిమా గురించే కాదు.. ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. మనం కూడా వినేద్దాం పదండి. పఠాన్ దర్శకుడితో మళ్లీ సినిమా చేస్తున్నారు షారుఖ్ ఖాన్.
తన కెరీర్‌లో తొలి వెయ్యి కోట్ల సినిమా ఇచ్చిన డైరక్టర్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఎలాగూ ఉంటుంది కదా.. ఈ మూవీకి కింగ్ అనే పేరు పరిశీలనలో ఉంది. టైటిల్ అయినా త్వరగా చెప్పమంటూ షారుఖ్ సిద్ధార్థ్ ని అడిగారు. అందరూ అడిగినప్పుడు కాదు.. తాను కావాలనుకున్నప్పుడే రాజు వస్తాడంటూ చమత్కరించారు సిద్ధార్థ్. వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. కింగ్ మూవీ గురించి మాత్రమే కాదు… తన ఏజ్ గురించి కూడా ప్రస్తావించారు షారుఖ్. 70 ఏళ్లప్పుడు, 80 ఏళ్లప్పుడు కూడా అందంగానే ఉంటానన్నారు. ఏజ్ పెరుగుతున్నకొద్దీ తానెంత అందంగా కనిపిస్తానన్నదాన్ని జనాలు విట్‌నెస్ చేస్తారని చెబుతున్నారు. నటుడిగా తన ప్రస్తానం గురించి ఎప్పుడూ గుర్తుంచుకుంటానని అంటున్నారు షారుఖ్. జనాలను ఎంటర్‌టైన్ చేయడానికే తాను సెలబ్రిటీ అయ్యానని, దానికోసం కష్టపడి పనిచేసినంత కాలం ఇంకే విషయాన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనీ చెప్పారు. తన కొడుకు తనను భరించగలిగితే.. అతని డైరక్షన్‌లోనూ సినిమా చేయడానికి రెడీగా ఉన్నానంటున్నారు షారుఖ్. ఈ మాటలన్నీ వినడానికి హ్యాపీగానే ఉంది.. త్వరగా మాంఛి సినిమాను రిలీజ్ చేయ్ గురూ.. మాకు అసలు కిక్ ఇచ్చేది అదేనని రిక్వస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా
సడన్ గా వెలుగులోకి వచ్చిన హీరోయిన్లు
Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

