మరో అల్పపీడనం మూడు రోజులు భారీ వర్షాలు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం.. గురువారం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం.. గురువారం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బీహార్ మీదుగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సహా పలు తీర ప్రాంత జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజల జీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఈ తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా మరోసారి వర్షాల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

