భీమవరం అంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ మాత్రం ఉండాల్సిందే
బాహుబలి మళ్ళీ రిలీజ్ కావడంతో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రభాస్ సొంత ప్రాంతం కావడంతో ఆ జోరు మామూలుగా లేదు. బాణాసంచా కాలుస్తూ, డిజే సౌండ్స్‌లో ప్రభాస్ పాటలకు డాన్సులు వేస్తూ, భారీ కేకును కట్ చేసి అభిమానులు ప్రభాస్ సినిమాను చూశారు. సినీ జగత్తులో చరిత్ర సృష్టించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు కలిపి బాహుబలి – ది ఎఫిక్ సినిమాగా నిర్మాతలు రిలీజ్ చేశారు.
బాహుబలి చిత్రాన్ని రాజమౌళి నిర్మించి పది సంవత్సరాలు కావడంతో మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ కావడం ప్రభాస్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. బాహుబలి – ది ఎఫిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆధ్వర్యంలో 51 కేజీల కేక్ కట్ చేశారు అభిమానులు. సినిమా ధియోటర్ వద్ద బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. బాహుబలి వన్, బాహుబలి 2 రెండు సినిమాలు కలిపి ది ఎపిక్ బాహుబలిగా సినిమా రావడం ఆనందంగా ఉందని అన్నారు. బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నామని ఈ సినిమాను అందరూ చూడాలని అన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు. డీజే సౌండ్స్‌తో డాన్స్‌లు చేస్తూ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేసారు ప్రభాస్ అభిమానులు.భారీగా థియేటర్స్ దగ్గరకు చేరుకున్న ప్రభాస్ అభిమానులు సినిమాను చూసి ఆనందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వన్డే ప్రపంచకప్ 2027కు ఆటగాళ్లు ఫిక్స్.. సిరాజ్, జైస్వాల్ ఔట్
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలపై చిరంజీవి స్పందన
అయ్యో.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఎంతంటే
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

