AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పేరుతో వ్యాపారాలా ?? తీవ్ర ఆగ్రహం

పెళ్లి పేరుతో వ్యాపారాలా ?? తీవ్ర ఆగ్రహం

Phani CH
|

Updated on: Oct 31, 2025 | 3:54 PM

Share

శోభా శెట్టి..! పేరుకు కన్నడ నటే అయినా తెలుగు ఆడియెన్స్ కు ఈమె బాగా పరిచయం. 'అగ్నిసాక్షి' సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అందులో మోనిత పాత్రలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా మరింతగా ఫేమస్ అయ్యింది.

గతేడాది కన్నడ బిగ్ బాస్ 11లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు రియాలిటీ షోస్ లోనూ విజేతగా నిలవనప్పటికీ తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది శోభ. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోందీ. ఇక ఈ సంగతి కాసేపు పక్కకు పెడితే.. ఇప్పుడీ బ్యూటీ.. ఉన్నట్టుండి అందరికీ బిగ్ షాకిచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలపాలవుతోంది. కార్తీక దీపం సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ మొదలైంది. తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది శోభ. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శోభా శెట్టి. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి శోభా శెట్టి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిలో పెళ్లి దుస్తుల్లో శోభ, యశ్వంత్ రెడ్డి నూతన వధూవరుల్లా కనిపించారు. ఇద్దరూ తలంబ్రాలు కూడా పోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.అయితే శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఓ జువెల్లరీ బ్రాండ్ యాడ్ షూట్ కోసం వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజం తెలుసుకున్న నెటిజన్లు ఈ స్టార్ జోడీపై సీరియస్ అవుతున్నారు. దాంతో పాటే మరికొంత మంది శోభ, యశ్వంత్‌ తీరును విమర్శిస్తున్నారు. పెళ్లి పేరుతో వీరిద్దరూ వ్యాపారం చేయడంపై ఫైర్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న బ్యూటీస్‌

Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్‌ రివ్యూ ఇచ్చిన గౌతమ్‌

Toxic: టాక్సిక్‌ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??

రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్‌