Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రివ్యూ ఇచ్చిన గౌతమ్
ఈ వారం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. పదేళ్ల తరువాత మరోసారి వెండితెర బాహుబలి మేనియా కనిపిస్తుంటే... వింటేజ్ వైబ్‌తో మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మాస్ మహారాజ్. మరి ఈ సినిమా బజ్, క్రేజ్ ఎలా ఉంది. పదేళ్ల తరువాత కూడా బాహుబలి వైబ్ అలాగే కంటిన్యూ అవుతోంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్‌ను తెలుగు ఆడియన్స్‌తో పాటు గ్లోబల్ మూవీ లవర్స్ కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అక్టోబర్ 31 అఫీషియల్ రిలీజ్. కానీ విదేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ఆల్రెడీ న్యూయార్క్‌లోని బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూసిన మహేష్ బాబు కొడుకు గౌతమ్, టీవీ 9తో తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం తెలుసుకునేందుకు ఇప్పుడు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్న గౌతమ్, సినిమాను రీ మాస్టర్ చేసి తీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రతీ సీన్‌కు గూజ్‌బంప్స్ వస్తున్నాయని చెప్పారు.ఇండియన్ సినిమా, అది కూడా మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇంత బజ్ క్రియేట్ చేయటం చాలా హ్యాపీగా ఉందన్నారు గౌతమ్. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏం చెప్పకపోయినా.. ఆ సినిమా చూసేందుకు తాను కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా అన్నారు. అక్టోబర్ 30న ప్రీమియర్స్‌తో ఆడియన్స్ ముందుకు రావాల్సిన మాస్ జాతర బాహుబలి కారణంగా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 31న ప్రీమియర్స్‌తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Toxic: టాక్సిక్ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??
రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్
మారనున్న EPFO రూల్స్..కోటి మందికి ప్రయోజనం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

