రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్
రైల్లో ప్రయాణించేటప్పుడు అప్పడప్పుడు బొద్దింకలు, ఎలుకలు కనిపించడం పరిపాటి. కానీ ఈమధ్య పాములు కూడా దర్శనమిస్తూ ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా వేగంగా దూసుకెళ్తున్న రైల్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును మధ్యలో నిలిపివేశారు. అనంతరం స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కొండచిలువను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. చెన్నై వెళుతున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న టీటీఈ ఎస్-2 కోచ్‌లోని వాష్‌రూంలో ఓ కొండచిలువ కదులుతూ ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ప్రయాణికులను అలర్ట్ చేశారు. వారిని టాయిలెట్ వైపు వెళ్లకుండా నిలువరిస్తూనే, ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన సీఐ, స్థానిక స్నేక్ క్యాచర్‌ను సంప్రదించారు. రైలు ఖమ్మం స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆర్‌పీఎఫ్ సిబ్బంది స్నేక్ క్యాచర్‌ను వెంటపెట్టుకొని ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వద్ద సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్‌కు రాగానే, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించి కొండచిలువను పట్టుకున్నారు. దాంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైలు చెన్నైకి బయలుదేరింది. సమయానికి స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన రైల్వే సిబ్బందిని, ధైర్యంగా పామును పట్టిన మస్తాన్‌ను ప్రయాణికులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారనున్న EPFO రూల్స్..కోటి మందికి ప్రయోజనం
దూసుకెళ్తున్న యూపీఐ.. రూ.143 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు
బట్టతలకు బై బై.. ఇక 20 రోజుల్లోనే సహజంగా జుట్టు..!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

