బాలికపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత..
మైనర్లు వాహనాలు నడపవద్దని పోలీసులు తరచూ చెబుతూనే ఉన్నా.. కొందరు తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో తమ పిల్లలకు వాహనాలు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల మైనర్లు ప్రమాదాల పాలవటమే గాక.. ఇతరులకూ ముప్పు తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే అహ్మదాబాద్‌లో జరిగింది. ఓ మైనర్ బాలుడు కారు నడుపుతూ బాలిక మీదికి ఎక్కించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మైనర్ బాలుడు కారు నడుపుతూ వెళ్తున్నాడు. ఓ వీధి మలుపు తిరుగుతుండగా ఎదురుగా ఓ బాలిక నడుచుకుంటూ వస్తోంది. కారును చూసి కంగారుపడిన బాలిక ఎటు వెళ్లాలో తెలీక.. వెనక్కు పరుగెత్తింది. అయితే, వేగంగా వచ్చిన ఆ కారు నేరుగా ఆ బాలికపైనుంచి దూసుకెళ్లింది. దీంతో భయపడిన ఆ బాలుడు.. కారు ఆపి గబగబా వచ్చి బాలికకు ఏమైందోనని కంగారుగా వచ్చి చూశాడు. అయితే, చక్రం కింద పడకుండా మధ్యలో పడిపోవటం, కారు ఆగగానే లేచి బయటకు రావటంతో ఆ బాలుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు అక్కడికి వచ్చి.. ఆ బాలుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలుడు నడిపిన కారు యజమానిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్ అయిన అమ్మ సెంటిమెంట్
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
విమానంలో ఫోర్క్‌తో తోటి ప్రయాణికులను గాయపరిచి..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

