విమానంలో ఫోర్క్‌తో తోటి ప్రయాణికులను గాయపరిచి..
ఆంధ్రా యువకుడు ఉసిరిపల్లి ప్రణీత్ కుమార్ అమెరికా నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాడు. ప్రయాణం మధ్యలో.. ప్రణీత్ కుమార్ అకస్మాత్తుగా రెచ్చిపోయి, తోటి ప్రయాణికులపై ఫోర్క్‌తో దాడి చేసాడు. వీసా కోల్పోయానన్న అక్కసుతో చేసిన దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనుక భాగంలో గాయమైంది.
దాడిని అడ్డుకోవడానికి విమాన సిబ్బంది ప్రయత్నించగా.. అతను వారిని కూడా భయపెట్టాడు. తన చేతి వేళ్లను తుపాకీగా చూపిస్తూ.. సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. విమానంలో ప్రణీత్ కుమార్ విపరీత ప్రవర్తనతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. విమానాన్ని దారి మళ్లించి, బోస్టన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసారు. అధికారులు ప్రణీత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ కుమార్ విద్యార్థి వీసాపై అమెరికా వచ్చాడు. మాస్టర్స్ డిగ్రీ చదవడానికి వచ్చిన అతను.. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికాలో విమానంలో దాడికి పాల్పడటం అనేది తీవ్రమైన నేరం. ఈ నేరం రుజువు అయితే ప్రణీత్ కుమార్‌కు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష రెండు కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ మహిళకు భారత పౌరసత్వం.. 20 ఏళ్ల కల సాకారం..
బ్రేకప్ లీవ్ అడిగిన ఉద్యోగి.. సీఈవో రియాక్షన్ ఏంటంటే..
రీల్ స్టోరీ కాదు.. రియల్ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

