రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
రాజస్థాన్‌కు వెళ్లిన గుజరాత్‌కు చెందిన ఐదుగురు పర్యాటకుల బృందం... సియాన్‌లోని హ్యాపీ డే హోటల్‌కు వెళ్లింది. అక్కడ వివిధ రకాల ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి, పీకల దాకా తిని మొత్తం 10,900 రూపాయల బిల్లు చేశారు. కానీ, బిల్లు చెల్లించకుండా ఖతర్నాక్ ప్లాన్‌వేసి తప్పించుకోవాలని భావించారు. ఇందుకోసం పాత సినిమాల్లో ట్రిక్స్ ప్లే చేశారు.
రెస్ట్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పి ఒకరి తర్వాత ఒకరు టేబుల్ వద్ద నుంచి మెల్లగా జారుకుని బయటపడ్డారు. తర్వాత బయటికి వెళ్లి.. అక్కడ పార్క్ చేసిన తమ కారులో ఎక్కి ఉడాయించే ప్రయత్నం చేశారు. అయితే.. టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోయిన కస్టమర్లు తిరిగి రాకపోవడంతో వాళ్లు బిల్లు ఎగ్గొట్టే ప్లాన్ చేసినట్టు హోటల్ యజమాని, సిబ్బందికి సీన్ అర్దమయ్యింది. దీంతో వారిని పట్టుకోడానికి వెంబడించారు. హోటల్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ కారు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లోని అంబాజీ వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తూ.. పోలీసుల సాయం తీసుకున్నారు. గుజరాత్ సరిహద్దు వరకు వెంబడించి పోలీసుల సహకారంతో ఐదుగురినీ అక్కడికక్కడే అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర డబ్బులేకపోవడంతో స్నేహితుడికి ఫోన్ చేసి, అతని దగ్గర డబ్బులు తీసుకుని బిల్లు చెల్లించారు. ట్రాఫిక్ జామ్ కాకుంటే బోర్డర్ దాటి తమ రాష్ట్రానికి వెళ్లిపోయేవారు. కానీ, వాహనాల రద్దీ కారణంగా దొరికిపోయారు. అయితే, వీరిపై కేసు నమోదుచేశారా? లేదా? అనేది మాత్రం తెలియలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో ఫోర్క్‌తో తోటి ప్రయాణికులను గాయపరిచి..
పాక్ మహిళకు భారత పౌరసత్వం.. 20 ఏళ్ల కల సాకారం..
బ్రేకప్ లీవ్ అడిగిన ఉద్యోగి.. సీఈవో రియాక్షన్ ఏంటంటే..
రీల్ స్టోరీ కాదు.. రియల్ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో

