రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్ అయిన అమ్మ సెంటిమెంట్
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అనిల్‌కుమార్ బొల్లా విషయంలో సరిగ్గా అదే జరిగింది. అబుదాబి లాటరీలో రూ.240 కోట్లకు పైగా జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. అక్టోబర్ 18న లక్కీ డే డ్రాలో అనిల్‌కుమార్ ఈ గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకోవడంతో.. అతని జీవితం ఒక్క రోజులో పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనిల్‌కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నారు.
అనిల్‌కు లాటరీ టికెట్‌లు కొనే అలవాటు ఉంది. యూఏఈలోనే రికార్డు స్థాయిలో 100 మిలియన్ దర్హామ్స్ అంటే రూ. 240 కోట్లు గెలుచుకున్నారు. తను ఎలాంటి మ్యాజిక్ చేయలేదని.. కేవలం ఈజీ పిక్ పద్ధతిలో టికెట్ కొన్నట్లు తెలిపారు. చివరి సంఖ్య తనకు చాలా ప్రత్యేకమైందని.. అది తన తల్లి పుట్టినరోజు అన్నారు. విజేతను ప్రకటించినప్పుడు తాను పూర్తిగా షాక్‌లో ఉన్నానని చెప్పారు. ఇక రూ.240 కోట్ల లాటరీ డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. ఒక కారు కొని అందులో తిరగాలనే కోరిక ఉంది. ఓ స్టార్ హోటల్‌లో పార్టీ చేసుకోవాలనుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి, వారితో కలిసి జీవితాంతం ఇక్కడే గడపాలనుకుంటున్నా. కొంత భాగాన్ని చారిటీలకు విరాళమిస్తా అని అనిల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనిల్‌కుమార్‌తో పాటు మరో 10 మంది కూడా 10 వేల దర్హామ్ ల చొప్పున గెలుచుకున్నారు. యూఏఈలో లాటరీ బహుమతిపై ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. దీంతో అనిల్ ఎటువంటి పన్ను కట్టకుండానే మొత్తం రూ.240 కోట్లను అందుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
విమానంలో ఫోర్క్‌తో తోటి ప్రయాణికులను గాయపరిచి..
పాక్ మహిళకు భారత పౌరసత్వం.. 20 ఏళ్ల కల సాకారం..
బ్రేకప్ లీవ్ అడిగిన ఉద్యోగి.. సీఈవో రియాక్షన్ ఏంటంటే..
రీల్ స్టోరీ కాదు.. రియల్ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

