దూసుకెళ్తున్న యూపీఐ.. రూ.143 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ దూసుకెళ్తోంది. 2025 మొదటి అర్ధభాగంలోనే ఏకంగా 106.36 బిలియన్లకు చేరింది. ఇది గతేడాదికంటే 35 శాతం ఎక్కువ. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ. 143.34 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ లెక్కలు చూస్తుంటే దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగాయో అర్థమవుతోంది. ప్రజల దైనందిన జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగంగా మారాయని స్పష్టమవుతోంది.
ఈ వివరాలను ‘వరల్డ్‌లైన్’ సంస్థ తన ‘ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ లో బుధవారం వెల్లడించింది. నివేదిక ప్రకారం యూపీఐ ద్వారా జరిగే సగటు లావాదేవీ విలువ తగ్గడం గమనార్హం. 2024 ప్రథమార్థంలో రూ.1,478గా ఉన్న సగటు లావాదేవీ విలువ, 2025లో ఇదే సమయంలో రూ. 1,348కి తగ్గింది. టీ కొట్టు, కిరాణా దుకాణం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు చిన్న చిన్న, రోజువారీ కొనుగోళ్లకు ప్రజలు యూపీఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఇది సూచిస్తోంది. ముఖ్యంగా వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే లావాదేవీలు 67.01 బిలియన్లకు చేరాయి. దీనికి కిరాణా ఎఫెక్ట్ కారణమని వరల్డ్‌లైన్ పేర్కొంది. దేశంలోని చిన్న, సూక్ష్మ వ్యాపారాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారాయని నివేదిక తెలిపింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో భారత్‌లో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మర్చంట్ నెట్‌వర్క్ ఏర్పడింది. ఈ క్రమంలో చెల్లింపుల మౌలిక సదుపాయాలు కూడా భారీగా పెరిగాయి. దేశంలో క్యూఆర్ కోడ్‌ల సంఖ్య 2024 జనవరితో పోలిస్తే 111 శాతం పెరిగి 2025 జూన్ నాటికి 678 మిలియన్లకు చేరింది. అలాగే, పాయింట్-ఆఫ్-సేల్ (POS) టెర్మినళ్ల సంఖ్య 29 శాతం వృద్ధితో 11.2 మిలియన్లకు చేరుకుంది. మరోవైపు క్రెడిట్ కార్డుల వాడకం ప్రీమియం ఖర్చులకు సాధనంగా మారుతోంది. యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 23 శాతం పెరిగింది. అయితే, చిన్న చెల్లింపులు యూపీఐ వైపు మళ్లడంతో పీఓఎస్ వద్ద డెబిట్ కార్డుల వాడకం దాదాపు 8 శాతం తగ్గింది. మొత్తం మీద మొబైల్ చెల్లింపులు 30 శాతం వృద్ధితో 98.9 బిలియన్ల లావాదేవీలను నమోదు చేశాయి. వీటి విలువ రూ. 209.7 ట్రిలియన్లుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బట్టతలకు బై బై.. ఇక 20 రోజుల్లోనే సహజంగా జుట్టు..!
పంటపొలాల్లో చిరుత.. వణికిపోతున్న రైతులు
బాలికపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత..
రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్ అయిన అమ్మ సెంటిమెంట్
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టి .. ఖతర్నాక్ ప్లాన్ బెడిసికొట్టి..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

