Toxic: టాక్సిక్ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??
యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 రిలీజ్ అయి మూడేళ్లు దాటిపోయింది. అయినా ఇంత వరకు ఈ కన్నడ హీరో కొత్త సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. దాదాపు రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్న యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడు..? ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటి? కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎమర్జ్ అయ్యారు యష్.
దీంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలతో యష్ జోరు చూపిస్తారని భావించారు ఫ్యాన్స్. కానీ ఈ సాండల్‌వుడ్ స్టార్స్ మాత్రం అందరి అంచనాలు తల కిందులు చేస్తూ మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. 2023 నుంచే డిస్కషన్‌లో ఉన్న టాక్సిక్ సినిమాను 2024 డిసెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లారు యష్. అంటే కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన రెండున్నరేళ్ల తరువాత కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ జరుగుతున్నా, ఇంకా రిలీజ్ డేట్ విషయంలో డౌట్స్ మాత్రం రెయిజ్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య టాక్సిక్ రిలీజ్ డేట్ వాయిదా పడనుందన్న న్యూస్ తెగ వైరల్ అయ్యింది. దీంతో యష్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఫైనల్‌గా ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించింది. ఈ సారి ఎలాంటి డిలే ఉండదని, ఆల్రెడీ ఎనౌన్స్ చేసినట్టుగా 2026 మార్చి 19న టాక్సిక్ ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అని కన్ఫార్మ్ చేశారు. ఈ అప్‌డేట్‌తో రాకీభాయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు టాయిలెట్‌లో అనుకోని అతిథి.. ప్రయాణికులు షాక్
మారనున్న EPFO రూల్స్..కోటి మందికి ప్రయోజనం
దూసుకెళ్తున్న యూపీఐ.. రూ.143 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

