‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
రంగం సినిమాలో హీరో జీవాను మోసం చేసే ఫ్రెండ్‌గా.. నెగెటివ్ రోల్లో అందర్నీ ఆకట్టుకున్న అజ్మల్.. ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతున్న అజ్మల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అందరూ షాకయ్యారు. ఈ హీరో తీరును దారుణంగా విమర్శించారు.
అయితే ఆ వెంటనే లైన్లోకి వచ్చిన అజ్మల్.. ఆ వీడియోలో ఉంది తాను కాదని.. అదో AI జనరేటెడ్ వీడియో అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో తన కెరీర్‌ను ఎవరూ తొక్కేయలేరంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తమిళ హీరోయిన్ నర్విని, అజ్మల్ స్టేట్మెంట్‌ను ఖండించింది. అజ్మల్ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడే.. అంటూ గతంలో అతనితో తనకు ఎదురైన ఓ బ్యాడ్ ఇన్‌సిడెంట్‌ను గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నర్విని.. అజ్మల్ బిహేవిర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అజ్మల్‌కు అమ్మాయిలను వేధించే అలవాటుందని.. తనని కూడా వేధించాడని.. సినిమా పేరుతో లోబరుచుకునే ప్రతయ్నం కూడా చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఓ ఫ్రెండ్ ద్వారా తనకు పరిచయం అయిన అజ్మల్.. తాను సినిమా యాక్టర్‌నంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పిన నర్విని… తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటూ ఆడిషన్‌కు పిలిచాడని.. తీరా వెళ్లాక.. ఆ గదిలో అజ్మల్ మాత్రమేఉన్నాడని చెప్పుకొచ్చింది. సినిమా టీం లేదా అని తాను ప్రశ్నిస్తే.. బయటికి వెళ్లారని.. అప్పటి వరకు కూర్చో అంటూ చెప్పి.. తనను లాక్కుని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడని ఎమోషనల్ అయింది. ఆ రోజు అజ్మల్ నుంచి తప్పించుకుని వెళ్లినా కానీ.. ఆ తర్వాత ఫోన్‌లో చాలా రోజులు వేధించాడని చెప్పింది. అయితే ఇప్పుడీ హీరోయిన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజ్మల్ పై మరో సారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శిరీష్ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్ ఎమోషనల్
రీతూ గేమ్ క్లోజ్ ఇక !! పవన్ తో మాధురి నయా స్ట్రాటజీ
TOP 9 ET News: కమల్–రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

