మొంథా ఎఫెక్ట్.. ఉప్పాడకు కొట్టుకొచ్చిన బంగారం
ఏపీని మొంథాతుఫాను అల్లకల్లోలం చేసింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారాయి. ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతూ తీరప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో చేపల కోసం వేట కొనసాగించే మత్స్యకారులు.. తుఫాన్ నేపథ్యంలో బంగారం కోసం అన్వేషించడం ఆసక్తిగా మారింది.
తుఫాన్ ప్రభావంతోనూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం రేణువులు అన్వేషిస్తున్నారు. ఇసుకలోని మిణుకు మిణుకుమని మెరిసే బంగారు రంగు రేణువులను సేకరిస్తున్నారు. కొందరికి బంగారం రేణువులు దొరకడంతో సంబరపడిపోతున్నారు. తుఫాన్ వచ్చిందంటే కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల్లో కొత్త ఆశలు చిగురిస్తుంటాయి. తుఫాన్‌లు, భారీ వర్షాలు, ఆటుపోటు సమయంలో సముద్ర తీరంలో పెద్దఎత్తున అలలు వస్తుంటాయి. దీంతో.. ఇసుకతో పాటు.. అనేక రకాల ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ దొరుకుతాయనే ప్రచారంతో ఉప్పాడ పరిసర ప్రాంతాల ప్రజలు. వాటి కోసం వేట కొనసాగిస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు
మొంథా ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

