పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు
ఓవైపు మొంథా తుఫాను గాలులు, మరోవైపు సోమశిల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహం, కనుచూపు మేర ఎటు చూసినా నీరు. కట్ చేస్తే మూడు ఇసుక బోట్లు తుఫాన్ గాలుల ధాటికి కట్టిన తాళ్ళు తెంచుకొని వేగంగా కొట్టుకు వచ్చాయి. అదే వేగంతో ఈ బోట్లు సంఘం బ్యారేజి గేట్లను కొట్టి ఉంటే.....ఆ ఆలోచనే జనాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి.
గతంలో ప్రకాశం బ్యారేజి వద్ద బొట్లు గేట్లకు కొట్టుకుని వచ్చిన విషయం పెద్ద రాజకీయ దుమారం రేపింది. అదే తరహాలో కాకున్నా అంతే వేగంతో వచ్చిన బోట్లు గాలి ధాటికి దిశ మార్చుకున్నాయి. నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజి వద్ద పెను ప్రమాదం తప్పింది. మొందా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కండలేరు, సోమశిల జలాశయాలు నిండుకుండలా మారి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. దీంతో అధికారులు కండలేరు నుంచి తెలుగు గంగ కి నీటిని విడుదల చేయగా సోమశిల జలాశయం నుంచి పెన్నా నదిలోకి నీటిని విడుదల చేసారు. సోమశిల నుంచి విడుదల చేసిన నీరు సంఘం బ్యారేజి వద్దకు చేరుకున్న తరువాత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లు సంఘం బ్యారేజి గేట్లు ఎత్తి పెన్నాకి నీటిని విడుదల చేశారు. సోమశిల నుంచి సంగం బ్యారేజీకి నీరు వచ్చే సమయంలో అప్పటికే పెన్నా నుంచి ఇసుకను తరలించేందుకు ఉపయోగించే మూడు బోట్లు తుఫాన్ గాలుల ధాటికి తాళ్ళు తెగి నీటి ప్రవాహం లో కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బోట్లు సంఘం బ్యారేజి వద్దకు చేరుకుని గేట్లను ఢీకొడితే పెను ప్రమాదమే జరిగేది. ఓ వైపు పెన్నాలో సోమశిల నీటి ప్రవాహం..మరోవైపు తుఫాన్ గాలుల ధాటికి వేగంగా వస్తున్న బోట్లు కలిసి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. కళ్ళ ముందు బోట్లు కొట్టుకుని వస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. వేగంగా నీటి ప్రవాహంలో కొట్టుకుని వస్తున్న బోట్లు సంఘం బ్యారేజీకి సమీపంగా వచ్చే సమయంలో అనూహ్యంగా దిశ మార్చుకున్నాయి. దీంతో సంఘం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొంథా ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??
జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

