AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబరు 1 నుంచి మారనున్న బ్యాంక్‌ రూల్స్‌

నవంబరు 1 నుంచి మారనున్న బ్యాంక్‌ రూల్స్‌

Phani CH
|

Updated on: Oct 30, 2025 | 6:31 PM

Share

నవంబర్‌లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, నామినీలు, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్‌ అమలులోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ సవరణ చట్టం కారణంగా ఈ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కొన్ని డెడ్‌లైన్స్ కూడా ఈ నెలలోనే ముగియనున్నాయి.

మీ బ్యాంకు ఎకౌంట్‌లు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, లాకర్లకు సంబంధించిన నామినీగా ఒక్కరినే పేర్కొనేవారు. అయితే ఇప్పుడు బ్యాంకింగ్‌ సవరణ చట్టం ప్రకారం నలుగురిని నామినీలుగా చేర్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ఖాతాదారుడి మరణానంతరం డబ్బు విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలూ తగ్గుతాయి. మీరు మీ ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా పేర్కొనవచ్చు. అంతేకాదు, ఎవరికి ఎంత వాటా వెళ్లాలి అన్నదీ మీరే నిర్ణయించుకోవచ్చు. వివిధ నగదు చెల్లింపు లావాదేవీల కోసం ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్‌. ఎడ్యుకేషన్‌ ఫీజు చెల్లింపులు, వాలెట్‌ లోడింగ్‌కు సంబంధించి నవంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉపయోగించి చేసే ఎడ్యుకేషన్‌ ఫీజు చెల్లింపులపై ఇకనుంచి 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ వెబ్‌సైట్లు, పీఓఎస్‌ మెషీన్ల వద్ద చేసే చెల్లింపులకు ఈ ఫీజు వర్తించదు. వాలెట్‌లో వెయ్యి రూపాయలకు మించి చేసే లావాదేవీలకు 1 శాతం ఫీజు వర్తిస్తుంది. అలాగే పెన్షన్‌దారులు పెన్షన్‌ పొందేందుకు నవంబర్‌ 1 నుంచి 30లోపు లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్‌ అందుకొనే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లు ఈ పత్రాన్ని సమర్పించాలి. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 80 ఏళ్లు దాటిన వ్యక్తులకు అక్టోబర్‌ 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ నుంచి యూనిఫైడ్‌ పెన్షన్‌ సిస్టమ్‌కు మారేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన గడువు నవంబర్‌ 30తో ముగియనుంది. వాస్తవానికి సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే తొలుత ఈ గడువు ఇచ్చారు. దాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలోనూ నవంబర్‌ 1న మార్పు రానుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు వీటి ధరలను సవరిస్తుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పూ లేననప్పటికీ.. వాణిజ్య సిలిండర్‌ ధరలో మాత్రం హెచ్చుతగ్గులు కనిపించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు

మొంథా ఎఫెక్ట్‌.. పాఠశాలలకు సెలవు

బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??

జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు

చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్‌