బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??
ఇటీవల తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. బుధవారం రూ.760 పెరిగిన బంగారం గురువారం 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా రూ.1910 తగ్గి రూ. 1,20,490 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1750 తగ్గి రూ. 1,10,450 పలుకుతోంది. వెండి కూడా కిలోపై రూ.1000 తగ్గి రూ.1,65,000 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,640 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,600 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,490, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,10,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,090, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,000 గా కొనసాగుతోంది.కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,20,490, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,450 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,20,490, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,10,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,65,000 గా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. సాయంత్రానికి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కనుక బంగారం కొనేందుకు వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు
చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్
భారీగా నగలు ధరిస్తే.. రూ. 50 వేలు జరిమానా !
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

