ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా ??
కర్నూలు జిల్లా లో బస్సు ప్రమాదం లో మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాధాలు వెంటాడుతున్నాయా అంటే అవుననే తెలుస్తోంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో నెల్లూరు జిల్లా వింజమూరుకు మండలానికి చెందిన రమేష్ కుటుంబం కూడా ఉంది.
ఈ ప్రమాదంలో రమేష్, అతని భార్య, కొడుకు, కూతురు సజీవదహనమయ్యారు. కాగా వీరి మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తున్న రమేష్ బంధువులు కూడా రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రమేష్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయంటూ చర్చించుకున్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు వింజమూరు మండలం గోళ్లవారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం వారి బంధువులు కారులో విజయవాడకు తిరిగి వెళ్తుండగా.. జలదంకి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైరు పంక్చర్ కావటంతో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సడెన్‌గా బ్లూ కలర్‌లోకి మారిన వీధికుక్కలు.. ఎక్కడంటే ??
చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్ చూస్తే నవ్వాగదు
ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షనర్లకూ పండగే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

