వామ్మో.. క్షుద్ర పూజలకు ఇలాంటి జంతువును బలిస్తారా?
కష్టాల నుంచి గట్టెక్కాలనుకునే వాళ్లు ..అనారోగ్యం నుంచి కోలుకోవాలని కొందరు ఇట్టాంటి భూత వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ఇక ఇంకొందరుంటారు. షాట్‌కట్‌లో కుబేరులైపోవాలని గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తుంటారు. పడనోళ్లపై పగ తీర్చుకునేందుకు చేతబడి బాట పడుతారు మరికొందరు. ఇలాంటి వారిలో ఎవరి పనో ఏమో కానీ పల్లెబాటలో మంత్రాల గత్తెర లేపారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామశివారులో క్షుద్రపూజలు చేసి పందిని బలిచ్చారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బాణామతి..చేతబడి వంటి క్షుద్రపూజల్లో ముగ్గులు వేయడం ..బొమ్మను పెట్టి పిన్నులు గుచ్చడం మాములే. కానీ ఇక్కడ సీన్ అట్టా లేదు. అంతకు మించి కత నడిపారిక్కడ. ఏకంగా పందినే బలిచ్చారు. క్షుద్రపూజలు జరిపిన తంతు స్ధానికంగా తీవ్ర చర్చగా మారింది. తమ ఊరికి ఏదో కీడు చేస్తున్నారనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. క్షుద్రపూజలు చేసిన వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుఫాను వేళ పాముల బీభత్సం.. వణికిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్.. మరో 2 రోజులు మొంథా తుఫాన్ ఎఫెక్ట్
మొంథా తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు వాగు.. 24 అడుగుల వరద
ఫోక్ డ్యాన్సర్‌కు బంపర్ ఆఫర్ ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్‌గా..
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

