తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్.. మరో 2 రోజులు మొంథా తుఫాన్ ఎఫెక్ట్
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తెలంగాణ, విదర్భా, మరాఠవాడాలో తీవ్ర వర్షపాతం వల్ల వరద వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఏపీలోని తీర ప్రాంతం యానంతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. మరో రెండు రోజులపాటు మొంథా ప్రభావం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ మరింత బలహీనపడనుందని అంచనా వేశారు. సముద్రంలో తీరం వెంబడి 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఉత్తర కోస్తాకు ఎల్లో అలెర్ట్ ,మధ్య కోస్తా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొంథా తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు వాగు.. 24 అడుగుల వరద
ఫోక్ డ్యాన్సర్‌కు బంపర్ ఆఫర్ ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్‌గా..
Chiranjeevi: ‘అతడు నన్ను టార్గెట్ చేశాడు’ పోలీస్ స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

