సడెన్‌గా బ్లూ కలర్‌లోకి మారిన వీధికుక్కలు.. ఎక్కడంటే ??
చిన్నప్పుడు కథల్లో మనం నీలిరంగు నక్క గురించి చదువుకున్నాం గుర్తుందా.. అలాంటి ఘటనే ఉక్రెయిన్‌లో జరిగింది. అక్కడ కొన్ని శునకాలు నీలిరంగులోకి మారిపోయాయి. ఉక్రెయిన్ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివసించే కొన్ని కుక్కల బొచ్చు ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారిపోయింది.
ఈ షాకింగ్ ఫోటోలను డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ అనే స్వచ్ఛంద సంస్థ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం స్థానికులనే కాదు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. స్వచ్ఛంద సంస్థ వివరాలు ప్రకారం.. 1986లో చెర్నోబిల్ అణు విపత్తు తర్వాత యజమానులు వదిలివెళ్లిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందినవే ఈ శునకాలు. మానవ సంచారం లేని ఈ ప్రాంతంలో వన్యప్రాణులతో పాటు ఈ కుక్కలు జీవిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 700 కుక్కలకు డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ సంస్థ ఆహారం, ఆశ్రయం, వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవలే రొటీన్ స్టెరిలైజేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా మూడు కుక్కలు ఇలా వింతగా నీలి రంగులో కనిపించాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వారం రోజుల క్రితం వరకు అవి సాధారణంగానే ఉన్నాయని స్థానికులు చెప్పడంతో ఈ మార్పుపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఈ కుక్కలు ఏదైనా తెలియని రసాయన పదార్థాన్ని తాకడం వల్లే వాటి బొచ్చు రంగు మారి ఉండవచ్చని సంరక్షకులు అనుమానిస్తున్నారు. పారిశ్రామిక రసాయనాలు లేదా పర్యావరణంలోని భారీ లోహాల ప్రభావం కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ రంగు మార్పుకు కచ్చితమైన కారణం ఏంటో తమకు తెలియదని, వాటిని పట్టుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వింత రంగులో కనిపిస్తున్నప్పటికీ, ఈ కుక్కలు చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని సంరక్షకులు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరీక్షల తర్వాతే ఈ రంగు మార్పు వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉందన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్ చూస్తే నవ్వాగదు
ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షనర్లకూ పండగే
వామ్మో.. క్షుద్ర పూజలకు ఇలాంటి జంతువును బలిస్తారా?
తుఫాను వేళ పాముల బీభత్సం.. వణికిపోతున్న జనం
తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్.. మరో 2 రోజులు మొంథా తుఫాన్ ఎఫెక్ట్
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

