Shah Rukh Khan: ఓజీ డైరెక్టరే కావాలంటున్న కింగ్‌ఖాన్
రీసెంట్ టైమ్స్‌లో యాక్షన్ మూవీస్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు ఆడియన్స్. అందుకే టాప్ స్టార్స్ కూడా ఆ జానర్ మీదే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌ను మన సినిమాల్లో చూపించే దర్శకులకు పాన్ ఇండియా రేంజ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. రీసెంట్‌గా ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుజిత్ ఖాతాలో ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయ్యింది.
ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్‌తోనే పాన్ ఇండియా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజిత్, రెండో సినిమాను ప్రభాస్ హీరోగా రూపొందించే ఛాన్స్ కొట్టేశారు అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో. బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ తరువాత సుజిత్ దర్శకత్వంలో సాహో చేశారు ప్రభాస్. ఈ మూవీలో డార్లింగ్ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు సుజిత్. సాహో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా…ఆ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా చేజ్ సీన్, క్లైమాక్స్ ఫైట్… ఇండియన్ ఆడియన్స్‌కు గతంలో చూడని ఓ కొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సుజిత్‌కు ఛాన్స్ ఇచ్చారు. పవన్ విషయంలోనూ సుజిత్ మేకింగ్ స్టైల్‌కు సెంట్ పర్సెంట్ మార్క్స్ పడ్డాయి. ఓజీ బ్లాక్ బస్టర్ తరువాత నాని హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు సుజిత్. అయితే ఆ తరువాత ఈ యంగ్ డైరెక్టర్ చేయబోయే సినిమా గురించిన న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. నాని సినిమా పూర్తయిన వెంటనే షారూఖ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు సుజిత్. ఆల్రెడీ సాహోతో బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించిన సుజిత్, ఇప్పుడు డైరెక్ట్‌గా బాలీవుడ్ స్టార్‌తోనే సినిమా చేస్తుండటంతో ఈ సారి సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న బ్యూటీస్
Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రివ్యూ ఇచ్చిన గౌతమ్
Toxic: టాక్సిక్ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

