ఎవరెస్ట్ శిఖరంపై కుప్పకూలిన హెలికాఫ్టర్
ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం, ట్రెక్కర్స్ కలల పర్వతం అయిన మౌంట్ ఎవరెస్టు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్లిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నేపాల్ వైపు ఎవరెస్టు శిక్షరం వద్ద తీవ్రంగా మంచు కురుస్తుండగా.. అక్కడ చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ అయింది.
అక్టోబర్ 29న బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ జారిపడి లోబుచేలో కూలిపోయింది. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ప్రమాధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. భారీ హిమపాతం కారణంగా మంచులో చిక్కుకున్న ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి మంచులోకి కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ కెప్టెన్ ఖడ్కా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హెలికాప్టర్ తోకభాగం దెబ్బతిన్నదని సోలుఖుంబు జిల్లా పోలీసు చీఫ్ మనోజిత్ కున్వర్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో అల్పపీడనం మూడు రోజులు భారీ వర్షాలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

