Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా
సుకుమార్ ఇప్పుడేం చేస్తున్నారు? పుష్ప సీక్వెల్ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. చెర్రీ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మధ్యలో పెద్ది సెట్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ సుకుమార్ ఇప్పుడేం చేస్తున్నారు? సరదాగా ఓ లుక్కేద్దాం వచ్చేయండి. పుష్ప సబ్జెక్ట్ తో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేశారు డైరక్టర్ సుకుమార్. పుష్ప2 ట్రెమండస్ సక్సెస్ అయ్యాక కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్నారు.
పుష్ప3 గురించి ఫ్యాన్స్ అడపాదడపా ప్రస్తావిస్తూనే ఉన్నా… ప్రస్తుతానికి ఆ సబ్జెక్టుకి కొంత బ్రేక్ తీసుకున్నారు. రామ్ చరణ్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది సుకుమార్‌కి. ప్రస్తుతం చెర్రీ… పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. ఆ మూవీని డైరక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సానా… సుకుమార్‌కి ప్రియశిష్యుడు. అందుకే ఈ సినిమా సెట్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు సుకుమార్. సానాకు ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇస్తున్నారనే మాటలూ ఉన్నాయి. సుకుమార్ ఇచ్చే సలహాలు.. సానాకి ఎంత వరకు ఉపయోగపడ్డాయన్నది ప్రీ రిలీజ్ ఆర్ ఆఫ్టర్ రిలీజ్.. వారిద్దరూ చెబితేగానీ తెలియదు. అప్పటిదాకా సుకుమార్ విజిట్స్ గురించి ఆ నోటా ఈ నోటా వినాల్సిందే. పెద్ది కంప్లీట్ కాగానే సుకుమార్ సెట్స్ కి వెళ్తారు చెర్రీ. ఆ సబ్జెక్ట్ రంగస్థలం మూవీకి సీక్వెల్ అనీ… కాదనీ.. రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ నేషనల్ లెవల్లో ఫేమ్ ఉన్న రామ్‌చరణ్.. అదే స్థాయి క్రేజ్ ఉన్న సుకుమార్.. నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ తో గ్లోబల్ బాక్సాఫీస్‌ని టార్గెట్ చేస్తున్నారు. పక్కా ఎమోషనల్ కమర్షియల్ కథను కలర్‌ఫుల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఇంటర్నేషనల్ లెవల్ స్టాండర్డ్స్ తో రూపొందించాలన్నది వారి ప్లాన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సడన్ గా వెలుగులోకి వచ్చిన హీరోయిన్లు
Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??
ఎవరెస్ట్ శిఖరంపై కుప్పకూలిన హెలికాఫ్టర్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

