అమెరికాలో ఆహార సంక్షోభం.. ఎమర్జెన్సీ ప్రకటన
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆహారపు కొరత ఏర్పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందే ఆహార సాయం నిలిచిపోనున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ కేథీ హోచుల్ అధికారిక ప్రకటన చేశారు.
అత్యవసర ఆహార సహాయం కోసం రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నామని, దీని ద్వారా 4 కోట్ల మీల్స్ అందిస్తామని ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఫుడ్ స్టాంప్స్ పథకాల ప్రయోజనాలు కోట్లాది మందికి అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని అక్టోబరు ప్రారంభంలోనే అమెరికా వ్యవసాయ శాఖ రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించింది. రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలోని ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతుండగా, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చట్టబద్ధంగా ఆమోదించిన అత్యవసర నిధులను విడుదల చేయడానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరిస్తోందని గవర్నర్ హోచుల్ ఆరోపించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో పలు రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ గత వారం ఎమర్జెన్సీ ప్రకటించి, SNAP లబ్ధిదారులకు రాష్ట్ర నిధులను కేటాయించారు. వెర్మంట్ రాష్ట్రం కూడా నవంబర్ 15 వరకు ఫుడ్ స్టాంప్స్ కొనసాగించేందుకు నిధులను ఆమోదించింది. న్యూ మెక్సికో సైతం 30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 25 రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు, అటార్నీ జనరళ్లు ట్రంప్ ప్రభుత్వంపై దావా వేశారు. అత్యవసర నిధులను వినియోగించే అధికారం తమకు లేదనడాన్ని వారు సవాలు చేశారు. ప్రజలకు ఆహార సాయం కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోర్టును కోరారు. అమెరికాలో SNAP పథకం ద్వారా సుమారు 4.2 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పేదరికంలో ఉన్నవారే కావడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఎకరాకు రూ.10 వేల పంటనష్టం..
Tamannaah Bhatia: ఏజ్ బార్ ఇష్యూ గురించి మాట్లాడిన తమన్నా
Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్
Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

