అణు పరీక్షలకు అమెరికా సైరన్.. చైనా పర్యటనకు ముందు ట్రంప్ సంచలనం
అణుశక్తితో దూసుకెళ్లే మిస్సైల్స్ రష్యా పరీక్షిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా చైనా పర్యటనకు బయలుదేరే ముందు ఈ తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
రష్యా , చైనాలు తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతున్నాయి. ట్రంప్ ట్రూత్ పోస్టుపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. ‘ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యూఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగిఉంది. నా మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ.. ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్లలోపు అవి సమానంగా ఉంటాయి. ఇతర దేశాలు దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున.. మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధశాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది’ అని ట్రంప్ రాసుకొచ్చారు. రష్యా తన ఆయుధ ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి.. అధునాతన అణు సామర్థ్యాలను విస్తరిస్తోంది. అణుశక్తి ఆధారిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ను ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ క్రమంలో చైనా కూడా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. మరో ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు.. అమెరికా, రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యూఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ అణు పరీక్షల గురించి ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వన్డే ప్రపంచకప్ 2027కు ఆటగాళ్లు ఫిక్స్.. సిరాజ్, జైస్వాల్ ఔట్
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలపై చిరంజీవి స్పందన
అయ్యో.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఎంతంటే
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

