AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్

Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్

Phani CH
|

Updated on: Nov 01, 2025 | 11:01 AM

Share

దీపిక పదుకొనె విషయంలో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీల్లో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీమ్ దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్టులో దీపిక పదుకొణె శ్రీ మహావిష్ణువు పదవ అవతారం అయిన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించింది.

అయితే ఇప్పుడు దీపిక పేరును ఎండ్ క్రెడిట్స్ నుంచి టీమ్ తొలగించినట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చివరిలో వచ్చే నటీనటుల జాబితాలో దీపిక పేరు కనిపించకపోవడాన్ని గమనించిన అభిమానులు, అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన దీపిక పేరును ఇలా తొలగించడం వృత్తిధర్మానికి విరుద్ధమని, ఇది చిన్నపిల్లల చేష్ట అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఎండ్ క్రెడిట్స్ ప్లే అవుతున్న సమయంలో తెరపై దీపిక కనిపించడం గమనార్హం. ఇటీవల ‘కల్కి’ సీక్వెల్ నుంచి దీపిక తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కక్షపూరితంగా ఆమె పేరును తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపిక నటించబోవటం లేదని గత సెప్టెంబర్‌లో వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పారితోషికం పెంపు, పని గంటల తగ్గింపు వంటి డిమాండ్ల వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ నుంచి కూడా పేరు తీసేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంపై చిత్ర‌బృందం క్లారిటీ ఇవ్వ‌వ‌ల‌సి ఉంది. అయితే, ఈ వివాదంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగానే కొన్ని మీడియా సంస్థలు తనిఖీ చేయగా, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలోని ఎండ్ క్రెడిట్స్‌లో దీపిక పేరు కనిపిస్తున్నట్లు తెలిసింది. మొదట పేరు లేకపోవడం సాంకేతిక లోపమా, లేక విమర్శలు వెల్లువెత్తడంతో మేకర్స్ దాన్ని సరిదిద్దారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవలే తన కుమార్తె కోసం సమయం కేటాయించేందుకు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా నుంచి కూడా దీపిక తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ చిత్రంతో పాటు అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్ట్‌లో నటించనుంది. ప్రస్తుతం కల్కి-2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపిక ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న వాళ్లకే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అనుష్క, రుక్మిణీ వసంత్, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం పని !! కర్నూలు బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం గాలింపు

స్వీట్స్‌ తయారీలో నిమగ్నమైన సిబ్బంది.. అంతలోనే ఊహించని సీన్‌

కూతురు చనిపోయి ఏడుస్తుంటే.. లంచాల కోసం జలగల్లా పీడించారు

కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలోగా మృతి

వారం రోజులకు కనికరించిన దొంగ.. దోచుకున్న నగలు వాకిట్లో లభ్యం