ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా
ప్రేమపేరుతో అమ్మాయిల వెంట తిరగడం.. మాయమాటలు చెప్పి మోసం చేయడం లాంటి ఘటనలు చాలానే చూశాం. ప్రతిరోజూ నెట్టింట ఇలాంటి ఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ చెప్పిన మాట వినలేదని ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
పోలీసుల వివరాలు ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమాజిగూడకు చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి, మణికొండలోని ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారి బంధం మరింత బలపడింది.ఈ క్రమంలోనే కొద్దికాలంగా భానుప్రకాశ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అక్టోబరు 26న రాత్రి నేరుగా యువతి ఫ్లాట్‌కు వెళ్లి గొడవకు దిగాడు భానుప్రకాష్. అనంతరం ఆమెను గదిలో బంధించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భానుప్రకాశ్ గొంతు పిసికి చంపేందుకు యత్నించాడు. ఈ విషయం పోలీసులకు చెబితే యాసిడ్ పోసి చంపుతానని తీవ్రంగా హెచ్చరించాడు. అతడి నుంచి తప్పించుకుని బయటపడిన యువతి, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్ దొంగ కూడా
భారతీయులకు అమెరికా మరో బిగ్ షాక్
రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్ కారు
Deepika Padukone: దీపికకు మరో షాకిచ్చిన కల్కి టీమ్
ఇదేం పని !! కర్నూలు బస్సు ప్రమాదం.. బూడిదలో బంగారం కోసం గాలింపు
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

