AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్‌.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్‌ ఆత్మహత్య

అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్‌.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్‌ ఆత్మహత్య

Phani CH
|

Updated on: Nov 01, 2025 | 12:01 PM

Share

కరీంనగర్‌ మంకమ్మతోటకు చెందిన డాక్టర్‌ ఎంపటి శ్రీనివాస్‌ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎనస్తీషియా విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులను నమ్మి అప్పిస్తే తిరిగివ్వకుండా ముఖం చాటేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తను అప్పు ఇవ్వడమే కాకుండా తన పేరుతో బ్యాంకులో కూడా రుణం ఇప్పించాడా వైద్యుడు.

శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ వైద్యురాలు. వారికి ఒక కుమారుడు. బాధిత కుటుంబం, పోలీసుల వివరాల ప్రకారం.. డాక్టర్‌ శ్రీనివాస్‌ తన స్నేహితులైన వింజనురి కరుణాకర్ కు రూ.1.50 కోట్లు, కిరణ్, కవిత, వెంకట నరహరి అనే మరో ముగ్గురు స్నేహితులకు రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామికి తన వ్యాపారం కోసం రూ.28 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బులు తిరిగి చెల్లించ లేదు. ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం లేదు. అంతేకాకుండా.. శ్రీనివాస్ బ్యాంకు ఈఎంఐలు చెల్లించడం కష్టం గా మారింది. శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చిన బ్యాంకు అధికారులు అప్పు తీర్చమని అడిగారు. అప్పు తీసుకున్న వ్యక్తులు ఇవ్వమని అడిగితే, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించారట. స్నేహితుల తీరు తో తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డ శ్రీనివాస్ అనిస్తిషియా ఇంజక్షన్..మొతాదు మించి తీసుకున్నాడు. అర్థరాత్రి సమయం లో ఇంజక్షన్ వేసుకున్నాడు. ఆసుపత్రి కీ తరలించే లోపే చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కష్ట పడి. డాక్టర్ చదివి. ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం తో కుటుంబ సభ్యులు కన్నీరు..మున్నీరుగా విలపిస్తున్నారు. మిత్రులు ఎంతకూ తన డబ్బు తిరిగివ్వకపోవడంతో శ్రీనివాస్ మనోవేదనకు గురయ్యాడనీ ఇదే విషయమై తన వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశాడని శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ తెలిపారు.ఈ ఆందోళనతో తన భర్త అనారోగ్యం పాలయ్యాడని, వారం రోజులు మానసిక వేదనకు గురయ్యాడని ఆమె చెప్పారు. మంగళవారం తను నిద్రలేచేసరికి భర్త నేలపై పడిపోయి కనిపించాడని విప్లవశ్రీ అన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌ పోలీసుపై యువకుడి రివెంజ్‌.. చుక్కలు చూపించాడుగా

అయ్యో ఈ మూగజీవికి ఎంత కష్టం వచ్చింది

బిగ్‌ అలర్ట్‌ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి

కాలర్ ఐడీ వచ్చేస్తోంది ఇక ఫేక్ కాల్స్‌కు చెక్

కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..