రీల్స్ చేయాలంటే డిగ్రీ ఉండాల్సిందే.. లేదంటే రూ లక్షల్లో ఫైన్!
మొదట్లో ప్రజాస్వామ్య సాధనంగా ఉన్న సోషల్ మీడియా.. క్రమంగా పరమ రోత.. అనే విమర్శలు ఎదుర్కొంటోంది. తప్పుడు సమాచార వ్యాప్తి, నేరాలకు ప్రోత్సాహం ఇచ్చే కంటెంట్ నుంచి ముప్పు పొంచి ఉందనే ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ భయపెట్టేలా చేస్తోంది. కంటెంట్ క్రియేటర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
దీంతో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను తెచ్చుకునేందుకు ఇన్ ప్లుయెన్సర్లుఆరోగ్యం, ఆర్థిక సూచనలపై మిడిమిడి జ్ఞానంతో ఏదేదో చెప్పేస్తున్నారు. దీంతో వీరు చెప్పేది నిజమే అని నమ్మిన అనేక మంది అమాయకులు బలవుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు తాజాగా చైనా తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం అర్హత ఉంటేనే సోషల్ మీడియాలో కామెంట్స్ చేయాలి. ఆరోగ్యం, ఆర్థిక, న్యాయ అంశాల పై మాట్లాడాలంటే డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ చూపించాలి. తప్పుడు సమాచార వ్యాప్తి బారి నుంచి ప్రజలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు తీసుకొచ్చింది చైనా. కంటెంట్ క్రియేటర్ల వివరాలు వారి పోస్టులను వెరిపై చేయాల్సిన బాధ్యత సామాజిక మాధ్య వేదికలపై మోపింది. ఏఐ కంటెంట్ ఉపయోగిస్తే ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా తెలాపాలి. చైనా కొత్త చట్టం ఇప్పుడు భారత్ లో చర్చగా మారింది. ఇండియా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు, కంటెంట్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోంది. అయినా వాటి నియంత్రణ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. కేంద్రం డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 తీసుకువచ్చింది. ఇప్పటికీ అశ్లీల కామెంట్స్, కంటెంట్ డంప్ అవుతూనే ఉంది. రోస్టింగ్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ ఐడీలతో వావి వరుసలు లేకుండా కంటెంట్ క్రియేట్ చేయడం, మిడిమిడి జ్ఞానంతోనే ఆరోగ్య సలహాలు ఇస్తుండటం కామన్‍గా మారింది. చైనా కొత్త రూల్స్ నేపథ్యంలో మనదేశంలోనూ అలాంటి చట్టం తెస్తే బాగుండని పలువురు అభిప్రాయడపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతా బాగుంది.. కానీ క్రెడిట్ స్కోర్ పెరగటం లేదు.. ఎందుకిలా ??
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

