ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!
విశాఖలో TU-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలో మిరుమిట్లు గోలిపే విద్యుత్ కాంతుల్లో.. అద్దాలా గదుల్లో అద్భుతమైన మాయా ప్రపంచం కొలువుదీరింది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక కాన్సెప్ట్ తో ఇది ఆకట్టుకుంటుంది. విశాఖ వచ్చే పర్యటకుల కోసం వినూత్నంగా దీనిని రూపొందించారు. అందులో అడుగుపెట్టగానే అనంత విశ్వంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది.
విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు విశాఖ నగరానికి వచ్చేసింది. ఆర్కే బీచ్ రోడ్డులోని TU-142 యుద్ధ విమాన మ్యూజియం భవనంలో మాయా వరల్డ్ రూపుదిద్దుకుంది . ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే.. మీ జీవితంలో మీరు ఎన్నడూ పొందని ఎక్స్పీరియన్స్ అక్కడ కలుగుతుంది. ఈ మ్యూజియంలో 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉంటాయి. ఎనిమిది గదుల్లో ప్రత్యేక కాన్సెప్ట్స్ తో మాయా వరల్డ్ ను తీర్చిదిద్దారు. ముత్యాల పరదాలు, మెరిసిపోయే గ్రహాలు కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన ప్రతిబింబమే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవతార్ సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక్కో గది ఒక్కో ప్రత్యేకమైన థీమ్ తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గదిలోకి అడుగుపెట్టగానే.. ఆ గది అక్కడ పొడవు, వెడల్పు అంచనా వేయడం అసాధ్యం. దారి కూడా సరిగా గుర్తించలేం. ఎందుకంటే ఆ గదులకు ఆరు వైపులా.. అద్దాలే. అంటే.. నేల, పైకప్పు, నాలుగు గోడలు అద్దాలే ఉంటాయి. దీంతో మన కళ్లు కనికట్టుకు గురవక తప్పదు. ప్రతి గది ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అద్భుత ఊహా లోకంలోకి తీసుకెళ్తుంది. అంతే కాదు.. బ్లింకింగ్ స్టార్స్ రూమ్, గ్లోయింగ్ ప్లానెట్ రూమ్, కెలైడో స్కోప్, అవతార్ ట్రీ, మిర్రర్ మేజ్, రెయిన్ బో కాలమ్.. అంటూ ఎన్నో అద్భుతాలు మాయా వరల్డ్ లో ఉన్నాయి. ఇక రివాల్వింగ్ టన్నెల్ బ్రిడ్జి స్పెషల్ ఎట్రాక్షన్. ఆ బ్రిడ్జి పై నిల్చుంటే.. మనం తలకిందులైపోతామా అన్న అనుభూతి కలగక మానదు. ఇది ముఖ్యంగా యువతకు, పిల్లలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. మహిళలకైతే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సెల్ఫీలు తీసుకునేందుకు, తమను ఆరువైపులా ఒకేసారి చూసుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా అమర్చిన అద్దాల్లో ప్రతిబింబం చూస్తూ మురిసిపోవాల్సిందే. నేవీలో పని చేసి రిటైర్డ్ అయిన రమణ కుమార్ ఈ అద్భుత ప్రపంచానికి రూపకల్పన చేసారు. ఆయన దుబాయ్‌లో ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఇక్కడ పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చామంటున్నారు. దుబాయ్ లో కాన్సెప్ట్ చూసి చైనా నుంచి వస్తువులను తీసుకువచ్చి డిజైన్ చేశామని అంటున్నారు. ఈ మాయా ప్రపంచంలో విహరించేందుకు ఒక్కొక్కరికి 15 నిమిషాలు మాత్రమే అనుమతి ఉంటుంది. పెద్దలకు టికెట్, ఏడేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్.. ఎందుకంటే ??
తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!
20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

