చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే
ఓ వ్యక్తిని ఊహించని విధంగా అదృష్టం వరించింది. అదే వారి కుటుంబంలో కలతలు రేపింది. కోట్లు విలువ చేసే షేర్ మార్కెట్‌కు సంబంధించిన పత్రాలు అతనికి ఇంట్లోని చెత్త బుట్టలో దొరికాయి. అయితే, అదికాస్త కుటుంబంలో వివాదానికి దారితీసింది. ఓ వ్యక్తి గుజరాత్‌లోని ఉనా గ్రామంలో చనిపోయిన తన తాతగా సావ్జీపటేల్ ఇంటికి వెళ్లాడు.
ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఇంట్లో ఉన్న ఓ చెత్త బుట్టలో షేర్ మార్కెట్‌కు సంబంధించిన పత్రాలు దొరికాయి. వాటి విలువ దాదాపు రూ.2.5 కోట్లు. దీంతో తాను కోటీశ్వరుడిని అయిపోయానని అతను సంబరపడిపోయాడు. కానీ, ఆ ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. ఆ షేర్లపై అతడితో పాటు అతని తండ్రికి కూడా హక్కులు ఉన్నాయని తెలిసింది. దాంతో వాటికి తాను వారసుడినంటే.. తానంటూ వాదించుకున్నారు. దీంతో ఇది కాస్తా కుటుంబంలో వివాదానికి దారితీసింది. సావ్జీ పటేల్.. డయ్యూలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆ హోటల్ యజమానికి చెందిన బంగ్లాలో హౌస్‌కీపర్‌గా ఉన్నారు. రైతు అయిన పటేల్ తండ్రికి ఉనా గ్రామంలో ఓ ఇళ్లు ఉంది. పటేల్ చనిపోయే ముందు.. ఆస్తి మొత్తానికి తన మనవడే వారసుడని పేర్కొన్నారు. కానీ, ఈ షేర్ మార్కెట్ పత్రాలపై హక్కును మాత్రం తన మనవడితో పాటు కుమారుడికి కూడా చెందేలా రాశారు. దీంతో తానే అసలైన వారసుడినని, షేర్ల విలువ మొత్తం తనకే దక్కుతుందని పటేల్ కుమారుడు వాదించాడు. అందుకు మనవడు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టుకు చేరింది. గుజరాత్ హైకోర్టు నవంబరు 3న దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..
ఆహా..! ఆ గదిలో అడుగుపెడితే.. అనంత విశ్వంలో తేలియాడుతారు!
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్.. ఎందుకంటే ??
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

