AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి! ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాడు మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి. తన వీడియోలకు యూట్యూబ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఉన్నట్లుండి సడెన్ గా పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Bigg Boss Telugu 9: పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి! ఏం జరిగిందంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 01, 2025 | 7:41 PM

Share

బిగ్ బాస్ రివ్యూయర్, మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో లాగానే ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి తన దైన శైలిలో రివ్యూలు ఇస్తున్నాడు. అందరికంటే ముందే బిగ్ బాస్ అప్డేట్స్ ను ఊహించి ముందే వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. వీటికి యూట్యూబ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి పోలీసులను ఆశ్రయించాడు ఆది రెడ్డి. తన రివ్యూల్లో భాగంగా కొంత మంది కంటెస్టెంట్లకు పాజిటివ్ రివ్యూలు చెప్పడం, అలాగే మరికొంతమందికి నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఆదిరెడ్డిని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తనను ఏ సోషల్ మీడియా అకౌంట్ నుంచి తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో వాటిని స్క్రీన్ రికార్డర్ చేశాడు. వాటినే సాక్ష్యధారాలుగా చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు తన పోస్టుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పోలీసుల డిపార్ట్మెంటును ట్యాగ్ చేశాడు. మరి ఆదిరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా ఆది రెడ్డి రివ్యూలను ఇష్టపడడని వాళ్లే అతనను ట్రోల్ చేస్తున్నారని సమచారం. ముఖ్యంగా కొంత మంది కంటెస్టెంట్స్ గురించి పాజిటివ్ గా చెబుతున్న తరుణంలో మిగతా కంటెస్టెంట్ ని అభిమానించే వాళ్లే అతనిపై ఎక్కువగా  నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఏదో ఒక కంటెస్టెంట్ కి పీఆర్ చేసేవాళ్లు ఆది రెడ్డికి ఇలా చేసి ఉండొచ్చన్నది టాక్. కాగా విష్ణు ఫ్రమ్ హైదరాబాద్ అనే అకౌంట్ తో ఒకరు ఆదిరెడ్డిని ట్రోల్ చేశాడు. అయితే ఆతర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఎకౌంటును డిలీట్ చేశాడు. కానీ ఆదిరెడ్డి మాత్రం ముందే దానిని స్క్రీన్ రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఆదిరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి లేటెస్ట్ వీడియో..

ఇటీవల కూతురి బారసాల వేడుకల్లో ఆదిరెడ్డి దంపతులు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!