Nandamuri Tejeswini: బాలయ్య కూతురు జ్యువెల్లరీ యాడ్‌లో ఎందుకు నటించిందో తెలుసా? వెలుగులోకి అసలు విషయం
నందమూరి నటసింహం, హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె ఇటీవల ఓ జ్యువెల్లరీ యాడ్ లో నటించడం ఆసక్తి రేపింది. అంతకుముందెన్నడూ కెమెరా ముందుకు రాని తేజస్విని ఉన్నట్లుండి ఈ బంగార ఆభరణాల యాడ్ లో నటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గాడ్ ఆఫ్ మాసెస్, హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ తాండవం సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బోయపాటి శీను తెరకెక్కిస్తోన్న అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈ సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అఖండ తాండవం సినిమాకు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి కూడా ఆమేనే నిర్మాతగా వ్యవహరించనున్నారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమాకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తేజస్వినినే చూస్తోంది. అయితే ఎప్పుడూ కెమెరా ముందు కనిపించని బాలయ్య కూతురు ఇప్పుడు సడెన్ గా ఓ నగల కంపెనీ యాడ్ లో నటించింది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమె ఆ కంపెనీ యాడ్ లో నటించింది. దీనిపై నందమూరి అభిమానుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి యాడ్ల్ లోనే తేజు అదరగొట్టిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
అయితే తేజస్విని ఈ యాడ్ లో నటించడం వెనక ఒక ఆసక్తికర విషయముంది. అదేంటంటే.. ఈ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ పేరులో సిద్ధార్థ్ మరెవరో కాదు తేజస్వినికి స్వయానా మరిది. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ సొంత తమ్ముడు. ఈ కారణంగానే తేజస్విని యాడ్ లో నటించింది. ఈ యాడ్ లాంఛ్ ప్రోగ్రాంలో తేజస్విని అత్త శ్రీమణి ూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా కంపెనీకి మా కోడలు బ్రాండ్ అంబాసిడర్ కావడం పట్ల చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. తేజు చాలా ప్రయివేట్ పర్సన్. ఎప్పుడూ బయటకు రాలేదు. చాలా రిజర్వ్ డ్ గా ఉంటుంది. పైగా కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మొదటిసారి ధైర్యం చేసి బయటకు వచ్చినందుకు ఆమెకు నా అభినందనలు. తను ఎంతో బాగా చేసింది. సింగిల్ టేక్ లోనే అన్ని షాట్స్ కంప్లీట్ చేసింది. ఒక్క రోజులోనే యాడ్ పూర్తి అయ్యింది. వాళ్ల నాన్నకు నిజమైన వారసురాలు అనిపించింది. ఆమె నా కోడలు కావడం మా అదృష్టం’ కోడలిపై ప్రశంసలు కురిపించింది.
సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ యాడ్ లో నందమూరి తేజస్విని..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







