Varun Tej- Lavanya Tripathi: వరుణ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి రోజు.. కొడుకు క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన మెగా ప్రిన్స్
టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ లో లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల జోడీ కచ్చితంగా ఉంటుంది. 2023 నవంబర్ ఇటలీ వేదికగా పెళ్లిపీటలెక్కిన ఈ ప్రేమ పక్షులు ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. తమ కుమారుడికి వాయు తేజ్ అని పేరు పెట్టుకున్నారు.

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఆదివారం (నవంబర్ 01) తమ రెండో పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేశారు వరుణ్-లావణ్య. ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లావణ్యతో ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేశారు. అలాగే కొడుకు వాయువ్ తేజ్‌తో ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నాడు. ‘హ్యాపీ యానివర్సరీ, లవ్! నువ్వు ప్రతీదాన్ని, ప్రతీ క్షణాన్ని, ప్రతీ రోజును మరింత అందంగా మారుస్తావు. నిన్ను పొందడం నా అదృష్టం’ అని భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు వరుణ్. ఈ మెగా ప్రిన్స్ షేర్ చేసిన ఫొటోలు, పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వరుణ్-లావణ్యలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరుణ్ తేజ్ పోస్ట్ పై స్పందించిన హీరో సాయి దుర్గ తేజ్.. ‘ కూలెస్ట్ పేరెంట్స్ అయిన ఈ కూల్ కపుల్‌కు హ్యాపీయెస్ట్ టూ’ అని విషెస్ చెప్పాడు. ఇదే సందర్భంగా వాయుతేజ్ ముఖాన్ని చూపించమని కొందరు నెటిజన్లు వరుణ్-లావణ్యలను కోరారు. కాగా వరుణ్, లావణ్య మిస్టర్ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగులోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది.ఆతర్వాత ‘అంతరిక్షం 9000 KMPH’ మూవీలోనూ జంటగా నటించారీ లవ్లీ కపుల్. చాలా ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న వీరు 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది ఇటలీ వేదికగా పెళ్లిపీటలెక్కారు. మే 2025న తాము మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో వాయు తేజ్ కు స్వాగతం పలికారు వరుణ్-లావణ్య.
వరుణ్-లావణ్యల రొమాంటిక్ ఫొటోస్..
View this post on Instagram
భార్య, కుమారుడితో వరుణ్ తేజ్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








